రామ్‌చరణ్ – సమంత జంటగా రానున్న మూవీ ‘రంగస్థలం’. షూట్ దాదాపుగా పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా చిట్టిబాబుగా చెర్రీని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్ సినీ లవర్స్‌ని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా రామలక్ష్మి పాత్ర చేస్తున్న సమంతకి సంబంధించిన టీజర్ విడుదల అయింది. ఈ పిల్లెదురు వస్తుంటే మా ఊరికి 18సం. వయస్సు వచ్చినట్టుంటదండి.. ఈ చిట్టిగాడి గుండెకాయని గోలెట్టించింది రామలక్ష్మేనండి అంటూ చరణ్ బ్యాక్ గ్రౌండ్లో చెబుతుండగా, ఎంతో ఇంప్రెసివ్‌గా ఉన్న లుక్స్ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకు సమంతకి సంబంధించి ఒక్క లుక్ కూడా బయటకి రాకపోవడంతో ఈ టీజర్ అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఫిబ్రవరి 13 సాయంత్రం 5గం.లకు చిత్రానికి సంబంధించి తొలిపాట విడుదల కానుంది. 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా ‘రంగస్థలం’ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. జగపతిబాబు, ఆది, అనసూయ ఈ మూవీలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎరినేని, రవిశంకర్ ఎరినేని, మోహన్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.