పవన్ కల్యాణ్ కు మళ్లీ కౌంటర్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

Update: 2018-04-20 11:26 GMT

పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లకు దర్శకుడు వర్మ కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ గారిని నెగటివ్‌గా కామెంట్‌ చేయనని మా మదర్‌ మీద ఒట్టేశాను. కానీ ఆయన పెట్టిన ట్వీట్ల మూలాన ఇక్కడ నేను నెగటివ్‌గా కాకుండా లాజికల్‌గా సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ప్రసిద్ద రచయిత ఆగథా క్రిష్టీ నవలల్లో కూడా ఇంత క్లిష్టమైన థియరీ చదవలేదని రాంగోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు. ఇంత అర్జెంట్‌గా మీటింగ్‌ పెట్టడానికి కారణం చంద్రబాబు చేపట్టిన స్పెషల్ స్టేటస్‌ దీక్షను డైవర్ట్ చేయడానికి, భరత్ అను నేను సినిమా కలెక్షన్లు తగ్గించడానికేనని అనగలను కానీ అనను. 

మీడియాలో మీటింగ్‌కు బదులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని శ్రీరెడ్డికి సలహా ఇచ్చిన మీరు అదే పని ఎందుకు చేస్తున్నట్లు అంటూ వర్మ ప్రశ్నించారు. అభిరాం ఎపిసోడ్‌ మీద ఇక ప్రొసీడ్‌ అవకపోతే 5కోట్లు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పాను. అంతేకాని మిమ్మల్ని తిట్టడానికి కాదు. నేను రిలీజ్ చేసిన వీడియోలో ఆ విషయం క్లియర్‌గా ఉంది. అంత డబ్బు ఆఫర్‌ ఇచ్చినా వద్దన్నా ఆ అమ్మాయి కారెక్టర్‌ గురించి తెలపడానికేనంటూ వర్మ ట్వీట్ చేశారు. 

అసలు ఏపీ స్పెషల్ స్టేటస్‌ కంటే లీగలైజేషన్‌ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అనే టాపిక్‌ ముఖ్యమైందా ? అని మీరు అడిగినపుడు. ఒక వైపు చంద్రబాబు స్పెషల్ స్టేటస్‌ కోసం దీక్ష చేస్తుంటే మీరు సరిగ్గా అదే రోజు చేస్తున్న దీని మాటేమిటీ ? అంటూ వర్మ ప్రశ్నించారు. ఏపీ స్పెషల్ స్టేటస్‌ కంటే ఎవరో ఆఫ్ట్రాల్‌ వ్యక్తి తిట్టారన్న విషయమే మీకు జాతీయ సమస్యా ? మీరు చెప్పిన వివిధ పేర్లు వేరే విషయాల్లో మూకుమ్మడిగా ముఠా అయితే అయ్యుండోచ్చేమో కానీ నాకు తెలియదు. నా విషయంలో వాళ్లకి ఏ విధమైన సంబంధమూ లేదంటూ ట్వీట్ చేశారు.

పెద్దవాళ్లని అన్నపుడే చిన్నవాళ్లు వెలుగులోకి వస్తారనేది ఆనాదిగా తెలిసిన సత్యం మహేశ్‌ కత్తి ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు. తనకీ సలహా ఇచ్చింది నేనే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఇది వేరోవరో దర్యాప్తు చేసి బయటకు తియ్యలేదు. ఎవరు అడగకుండా నాకు నేనే నా వీడియో ద్వారా ఒప్పుకొని క్షమాపణ చెప్పానని స్పష్టం చేశారు. 

Full View

Similar News