శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్..

Update: 2018-04-19 04:34 GMT

శ్రీరెడ్డి.. పవన్ కల్యాణ్‌ను తీవ్ర పదజాలంలో తిట్టడానికి కారణమేంటి..? శ్రీరెడ్డి చేత పవన్‌ని అలా అనడానికి కారణమెవరు..? రాంగోపాల్ వర్మే శ్రీరెడ్డి చేత అలా మాట్లాడించారా..?  శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్ వ్యవహారంలో అసలు నిజాలేంటి..?

HMTV చేతిలో శ్రీరెడ్డి ఆడియో టేప్..శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్..టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి వివాదం మరో మలుపు తిరిగింది. శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ ‌ను తిట్టడానికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మే కారణమని తేలింది. ఈ విషయాన్ని శ్రీరెడ్డి సన్నిహితురాలు తమన్నా సింహాద్రి HMTV స్టూడియోలో బయటపెట్టారు. తమన్నా సింహాద్రితో శ్రీరెడ్డితో ఫోన్లో ఏం మాట్లాడిందో వివరించారు. శ్రీరెడ్డితో మాట్లాడిన ఫోన్ సంభాషణను తమన్నా సింహాద్రి HMTV చేతికి ఇచ్చారు. అసలేం జరిగిందో ఈ ఆడియో టేప్‌లో ఉంది.

Similar News