అవి అందమైన జ్ఞాపకాలు: రేణు దేశాయ్

Update: 2018-09-17 12:06 GMT

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా పాత స్మృతులను నెమరేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తన మాజీ భర్త, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో, తనతో ముడివేసుకున్న బెలె అనే పెంపుడు కుక్క గురించి పోస్ట్ పెట్టారు. ఆ కుక్క పేరు బెల్‌. న్యూ ఫౌండ్‌ల్యాండ్‌ జాతికి చెందిన శునకం. అది పవన్‌ పెంపుడు కుక్కే. ఈ శునకంతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పవన్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ పాట చిత్రీకరణ మొత్తం న్యూజిలాండ్‌లో జరిగింది. ఈ పాటలో బెల్‌ కూడా ఉంది. షూటింగ్‌ సమయంలో అందరూ బెల్ ఆకారాన్ని చూసి తెగ భయపడేవారు. ఆ సమయంలో నేను ‘ఖుషి’ సినిమాకు సహాయ దర్శకురాలిగా, సహాయ ప్రొడక్షన్‌ పర్సన్‌గా పనిచేశాను. సెట్స్‌లో అందరూ బెల్‌కు భయపడుతుండడంతో షూటింగ్‌ అయిపోయేంతవరకు రెండు రోజుల పాటు నేనే దాన్ని దగ్గరుండి చూసుకున్నాను. కానీ బెల్‌ చాలా మంచిది. దానితో చాలా సరదాగా గడిపాం. అవి అందమైన, ఆనందకరమైన షూటింగ్‌ జ్ఞాపకాలు.’ అని పేర్కొంటూ బెల్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు రేణు.

Similar News