ఎన్నో నిరసనల మధ్య రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లఘు చిత్రం 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా మియా మల్కోవా న్యూడిటీపై ఆధారపడి తీసిన 19 నిమిషాల నిడివి గల ఈ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీంతో, నెట్లో ఇది విడుదల కాగానే, చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. లక్షల మంది ఒక్కసారిగా సైట్లోకి ఎంటర్ కావడంతో... అది క్రాష్ అయింది కూడా.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వీడియోను స్నేహితులతో కలిసి వర్మే రూపొందించాడని తెలుస్తోంది. ఈ వీడియో నిర్మాణానికి దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చైందట. అందులో సింహభాగం మియా మల్కోవాకే వెళ్లిందట. ఇంకొంత రీ-రికార్డింగ్ చేసిన కీరవాణికి చెల్లించారట. ఇప్పటివరకు ఈ వీడియో వల్ల నిర్మాతలకు పదకొండు కోట్లకు పైగా ఆదాయం వచ్చిందట. అంటే రూ.70 లక్షలు ఖర్చుపెడితే 11 కోట్ల రూపాయల ఆదాయం. అందుకే వెంటనే జీఎస్టీ-2ను ఆర్జీవీ ప్రకటించాడు.