జూనీయర్ ఎన్టీఆర్.. రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ సినిమా ఓపినింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది అదే బాహుబలిలో కిలికిలి భాష పెట్టాడు రాజమౌళి మళ్ళీ ఈ సినిమాలో ఆ ప్రయోగం చేయబోతున్నాడు.‘ఆర్.ఆర్.ఆర్’లోనూ ఓ కొత్త తరహా భాష వినిపించబోతున్నాడు రాజమౌళి. అయితే దీనికి సంబంధించిన కార్కీ అనే తమిళ రచయితను దీని కోసం పెట్టాడు.. బుర్రా సాయిమాధవ్ తో పాటు కార్కీ కూడ సంభాషణలు రాస్తున్నాడు.. జై లవ కుశ లో ఎన్టీఆర్ స్లాంగ్ కొద్దిగా డిఫరెంట్ గా వాడాడు.. మళ్ళీ ఇందులో ఎన్టీఆర్ కోసం కొత్త బాష ను స్రుష్టిస్తున్నాడు రాజమౌళి. ఎన్టీఆర్ ఒక వైపు బాడీ ఫిట్ నెస్ మార్చుకుంటునే మరో వైపు ఈ భాష కోసం సాధన చేస్తున్నాడంటా.. ఈనెల 19 నుంచి తొలి షెడ్యూల్ జరగబోతోంది. తొలుత యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని అంటున్నారు.