సీఎం సడన్‌ డెసీషన్‌తో...జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలకు...

Update: 2018-08-31 04:44 GMT

ఆ మంత్రులకు ముందస్తు పేరు చెబితేనే ముచ్చెమటలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నా త్వరితగతిన ఎన్నికలకు వెళ్లాలంటేనే వణుకుతున్నారు. పార్టీ పెద్దలు ముందస్తు మూడ్‌తో అలర్ట్‌ అవుతుండగా ఆ మంత్రులకు అదే టెన్షన్‌ పుట్టిస్తోంది. ఎవరా మంత్రులు..? ఎన్నికలకు వెళ్లేందుకు భయమెందుకు..? 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా. అటవీశాఖ మంత్రి జోగురామన్న, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు మంత్రులకు తాజాగా సరికొత్త తలనొప్పి మొదలైంది. అదే ముందస్తు ఎన్నికలు. ఎన్నికలకు సిద్ధం కావాలని అందరూ తమ తమ నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ సూచించారు. అయితే సీఎం సడన్‌ డెసీషన్‌తో సదరు మంత్రులకు కొత్త టెన్షన్‌ పట్టుకుంది. 

ముఖ్యంగా మంత్రి జోగురామన్న నియోజకవర్గంలో యేళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న లోయర్ పేన్ గంగాను ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. బ్యారేజీ నిర్మాణ పనులతో చిరకాల స్వప్నం నేరువేరుతుందని రైతులు కూడా సంబరపడ్డారు. అయితే ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే. దీంతో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిగితే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లాలని మంత్రిగారు భావించారు. అయితే ముందస్తు ముంచుకురావడంతో ఏం చేయాలో రామన్నకు తోచడం లేదు. 

ఇటు నిర్మల్ జిల్లాగా ఏర్పాటవుతుందని కలలో కూడ ఊహించలేదెవరు. అసాద్యమనుకున్న పనిని మంత్రి ఇంద్రకరణ‌్ రెడ్డి సుసాద్యం చేసిచూపించారు. కాని జిల్లా కార్యాలయాల ఏర్పాటు ఆయనపై మాయని మచ్చగా పడింది. కలెక్టరేట్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలం వివాదాస్పదమవడం జిల్లా కేంద్రంలో కాకుండా మంత్రి సొంత గ్రామ సమీపంలోని కోచ్చేరువు ప్రాంతంలో నిర్మించాలని ప్రతిపాదించడం ప్రజల్లో వ్యతిరేకత రావడం చకచకా జరిగిపోయాయి. అంతేకాకుండా దీనిపై కోర్టు కేసు కూడా నడుస్తోంది. ఇలా సమస్యలతో సతమతం అవుతున్న ఇంద్రకరణ్‌రెడ్డి ముందస్తు విషయంలో కంగారుపడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇటు ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోనప్ప పరిస్థితి అలాగే ఉంది. సిర్పూర్‌ పేపర్‌ మిల్లును తెరిపించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు పరిశ్రమను స్వాధీనం చేసుకుని జేకే మిల్లు యాజమాన్యానికి అప్పగించారు. కాని మిల్లు పున: ప్రారంభమైనా ఉత్పత్తి మాత్రం మొదలు కాలేదు. ఇలా ముగ్గురు నాయకులు తమ తమ సమస్యలతో ప్రజల ముందుకు వెళ్లేదెలా అని తలలు పట్టుకుంటున్నారు. ముందస్తుకు వెళ్తే లాభం చేకూరుతుందని నమ్మతున్న పార్టీ హైకమాండ్ ను కాదని వారిని నమ్ముకుని ప్రజల ముందుకు వెళ్లడం ఎలా అని ఆలోచిస్తున్నారు. 

Similar News