విమానంలో పైలెట్ చేసిన ప్రేమ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. విమానంలో పైలెట్ ఏం చేస్తుంటాడు. ప్రయాణికుల్ని గమ్యస్థానాలకి చేర్చడం. ప్రయాణికుల భద్రత గురించి సంకేతాలిస్తుంటాడు. కానీ ఓ పైలెట్ మాత్రం అందుకు భిన్నంగా ప్రయాణికుల ముందే తన ప్రేమను వ్యక్తం చేసి నెట్టింట్లో హాట్ టాపిగ్గా మారాడు. డెట్రాయిట్ కు చెందిన ఓ విమానం కొద్ది సేపట్లో ఒక్లహామకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ సమయంలో డెట్రాయిట్ కు చెందిన విమానం క్యాబిన్ నుంచి పైలెట్ జాన్ ఎమర్సన్ భయటకి వచ్చాడు. అనంతరం తన జేబులోనుంచి ఓ ఖరీదైన ఉంగరం బయటకు తీసి పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. పైలెట్ నిర్వాహకంపై విమానం లో ఏం జరుగుతోంది తెలియక ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తాను సహచర ఉద్యోగి గిబ్స్ ను ప్రేమిస్తున్నాంటూ ఆ ఉంగరాన్ని ఆమెకు అందించాడు. వెంటనే ఆమె ఓకే కూడా చెప్పేసింది. ఈ వీడియోను ఆ పైలెట్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. పైలెట్ ప్రేమ ప్రపోజల్ పై ఫిదా అయిన 1.8 లక్షల మంది ఆ వీడియోను చూశారు.