టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై అనేక మంది హీరోయిన్లు స్పందిస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కొత్త హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా కామెంట్స్ చేసింది. పైగా, ఈమెను కూడా ఓ వ్యక్తి పడక గదికి రమ్మని పిలిచినట్టు చెప్పింది. కానీ, తాను కాంప్రమైజ్ కాలేదని స్పష్టం చేసింది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు నాలుగు రోజుల కిందట కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.`నాకు కథ నచ్చితే సినిమా కోసం ఏమైనా చేస్తాను. కానీ, బయట మాత్రం కాదు. సినిమాలో అన్ని ముద్దులు పెట్టానని బయట కూడా ముద్దులు పెడతానని అనుకుంటున్నారా? నా తొలి సినిమా చూసి నా గురించి ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నారు. విజయవంతమైన సినిమాలో నటించిన తర్వాత కూడా నాకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైంది. నాల్రోజుల క్రితం ఒకరు ఫోన్ చేసి `కాంప్రమైజ్` అయితే అవకాశం ఇస్తానని చెప్పాడు. నేను టాలెంట్‌తోనే ఇంత దూరం వచ్చాను తప్ప.. కాంప్రమైజ్ అయి కాదు` అని పాయల్ చెప్పింది.