పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటుడు, రచయిత సయీద్ సాజిద్ హసన్‌కు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స వికటించింది. ఆయన ఈ విషయాన్ని ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. చికిత్స ప్రారంభం నుంచే తాను ఇబ్బందులెదుర్కొన్నానని పేర్కొన్నారు. తలపై ఇన్ఫెక్షన్ వచ్చిందని.. తీవ్ర జ్వరంతో బాధపడ్డానని తెలిపారు. అదేమని డాక్టర్ని ప్రశ్నిస్తే ఇదంతా కామన్.. అంతా బాగానే ఉందని.. సెలైన్ వాటర్‌తో తలను శుభ్రం చేసి ఊరుకున్నారని సాజిద్ హసన్ వెల్లడించారు. వీడియోలో ఆయన తలపై ఉన్న గాయాన్ని కూడా చూపించారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్య పరంగానే కాకుండా.. వృత్తిపరంగా కూడా ఇబ్బంది పడుతున్నానని స్పష్టం చేశారు. ఎవరైనా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటే మంచి సర్జన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. సాజిద్ హసన్ కరాచి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. చాలా సినిమాల్లో నటించారు. కొన్ని టీవీ ప్రోగ్రామ్స్‌లో కూడా నటించారు.