అభయ్‌ని ఎవరూ కాపాడలేరు: ఎన్టీఆర్

Update: 2018-06-09 12:05 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య ట్విట్టర్‌లో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు. తనకి సంబంధించిన కొన్ని విషయాలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. తన అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు. ఎన్టీఆర్‌కు తన కుమారుడు అభయ్‌ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అభయ్‌ ఫొటోలను, ఇతర విషయాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు ఎన్టీఆర్‌. తాజాగా ఆయన అభయ్‌కుసంబంధించిన ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘వాడు రోజు తాగాల్సిన పాల కోటాకు సంబంధించిన విషయంలో అభయ్‌ని వాళ్ల అమ్మ నుంచి కాపాడలేం’ అంటూ సరదాగా కామెంట్‌ చేశారు. అభయ్‌ పాలు తాగుతున్న ఫొటోను కూడా షేర్‌ చేశారు ఎన్టీఆర్‌.  దీనికి ప్రతిగా హాస్య నటుడు వెన్నెల కిషోర్‌ స్పందిస్తూ.. క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడెడ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. 

Similar News