నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ లో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బయోపిక్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతు తాను 62గెటప్పుల్లో కనిపిస్తానని అన్నారు. అంతేకాదు సినిమాల్లో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి అన్నీ అంశాలు తెరపై చూపిస్తామని తెలిపారు. మరి ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీలక ఘట్టాలని చూపిస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అంతేకాదు తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని అనేకోణాల్లో మిత్రులు, శత్రువులు సైతం ఈ బయోపిక్ లో ప్రత్యక్షమవుతారని వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ గురించి అన్నీంటిని సినిమాలో చూపిస్తున్నట్లు చెప్పినన బాలయ్య.. ఆయన జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ తీస్తారు? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే చంద్రబాబు ద్రోహం, ఎన్టీఆర్ దయనీయమైన చివరి రోజులు.. చూపించరని తెలుస్తోంది. ఎన్టీఆర్ బాల్యం నుంచి ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తరవాత కథ ఆగిపోతుందట. పార్టీ స్థాపించడం, దానికి తెలుగుదేశం అని నామకరణం చేయడంతో ఈ సినిమాకి ఇంట్రవెల్ కార్డు పడబోతోందని… సెకండాఫ్ అంతా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ఉండబోతోందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.