సొంత పార్టీ నేతలకు జేసీ ఝలక్

Update: 2018-07-19 04:47 GMT

కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ మద్దతు కూడగడుతున్న సమయంలో ఎంపీ జేసీ దివాకర్‌‌రెడ్డి సొంత పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు. టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా సంచలన నిర్ణయం తీసుకుని కలకలం రేపారు. అవిశ్వాసానికి దూరంగా ఉంటానని ప్రకటించిన జేసీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు అసలు హాజరుకాబోనంటూ ప్రకటించారు. అంతేకాదు విప్ జారీ చేసినా వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పారు. తనకు హిందీ ఇంగ్లీష్ రాదనీ అలాంటప్పుడు పార్లమెంటు సమావేశాలకు వెళ్లి ఏం చేయాలంటూ టీడీపీలో కాక పుట్టించారు. 

జేసీ దివాకర్‌‌రెడ్డి అనంతపురం టీడీపీ ఎంపీ ఈయన రూటే సెపరేటు అందరూ వెళ్లే దారి ఈయనకసలు నచ్చనే నచ్చదు అందరూ ఒకటంటే ఈయన ఇంకొకటి అంటారు ఎవరైనా సరే డోంట్ కేర్‌ అన్నట్లు ఉంటుంది వ్యవహారశైలి తన వ్యాఖ్యలతో ప్రత్యర్ధులనే కాదు సొంత పార్టీని సైతం ఇరకాటంలో పెట్టగల సమర్ధుడు చెప్పాలనుకున్నది స్ట్రయట్‌గా ముఖం మీదే చెప్పేస్తారు ముఖ్యమంత్రి ముందైనా సరే ముక్కుసాటిగా మాట్లాడతారు ఓవరాల్‌గా ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో మంట పుట్టించే జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి షాకిచ్చారు. టీడీపీ ఎంపీలంతా అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే హడావిడిలో బిజీబిజీగా ఉంటే జేసీ మాత్రం అనంతపురంలోనే మకాం వేశారు.

ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే జేసీ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీలో కలకలం రేపారు. అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అంతేకాదు విప్ జారీ చేసినా వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. పైగా అవిశ్వాసం పెట్టినంత మాత్రాన ప్రభుత్వం పడిపోదని కామెంట్ చేశారు. తనకు హిందీ, ఇంగ్లీష్ రాదనీ అలాంటప్పుడు పార్లమెంటు సమావేశాలకు వెళ్లి ఏం చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక్క అవిశ్వాసానికే కాదు మొత్తం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకే హాజరుకాబోనంటూ టీడీపీ అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. తన నిర్ణయానికి కారణాలు త్వరలోనే తెలుస్తాయన్నారు జేసీ. తనకు ఎవరిపైనా కోపం, విభేదాలు లేవంటున్న దివాకర్‌రెడ్డి తాజా నిర్ణయంపై మరో టీడీపీ ఎంపీ సుజనాచౌదరితో ఫోన్లో మాట్లాడారు.

జేసీ నిర్ణయం టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మోడీ సర్కారుపై అవిశ్వాసం పెట్టి దేశం మొత్తం చూపును తనవైపు తిప్పుకున్న టీడీపీని డిఫెన్స్ లోకి నెట్టింది. అవిశ్వాసానికి ఇతర పార్టీల మద్దతు కూడగడుతున్న టీడీపీ సొంత ఎంపీ మద్దతును మాత్రం కోల్పోయింది. మరి జేసీ ఎదుకు అలిగారు? జేసీ సంచలన నిర్ణయానికి కారణమేంటి? అవిశ్వాసానికి దూరంగా జేసీ ఒక్కరే ఉంటారా? లేక ఆయన బాటలో మరింత మంది నడుస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది.

Similar News