కరుణానిధి మన తెలుగింటి బిడ్డే...మాతృభాష కూడా తెలుగే

Update: 2018-08-08 04:54 GMT

తమిళ సాహిత్యంపై పట్టు సాధించారు రచయితగా చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు. అక్కడి రాజకీయాలను శాసించారు ముఖ్యమంత్రిగా ఏలారు. అరవ ప్రజల హ్రుదయాలను గెలుచుకున్నారు వారి మన్నలను కూడా పొందారు. అలాంటి కరుణానిధి తమిళుడేనా..? ఆయన మూలాలు ఎక్కడ..? ఆయన తెలుగువారంటే నమ్ముతారా..? 

 ద్రవిడ రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు అరవ రాజకీయాలను శాసించిన ధీరుడు తమిళ సూరీడు కరుణానిధి. మనకు తెలిసినంత వరకు కరుణానిధి అంటే పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తే. కానీ అది నిజం కాదు. కరుణానిధి అచ్చంగా తెలుగువారే. తమిళ సాహిత్యంపై అసమాన ముద్ర వేసిన కరుణానిధి మాతృభాష కూడా తెలుగే. 

 బ్రిటీషు కాలంలో ఆంధ్ర, తమిళనాడులోని చాలా ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. ప్రజలంతా కలిసి ఉండేవారు. తెలుగు తమిళ ప్రజలంతా కలిసున్న మద్రాసు ప్రెసిడెన్సీలో 1924 జూన్ 3 న కరుణానిధి జన్మించారు. తిరువారూర్‌ జిల్లాలోని తిరుక్కువళైలో ఆయన జన్మించారు. కరుణానిధి తండ్రి ముత్తువేలు, తల్లి అంజు కూడా తెలుగువారే. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. అచ్చమైన తెలుగు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఆయన పుట్టారు. 

చిన్నప్పటి నుంచే సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా ఉండే కరుణానిధి తమిళసాహిత్యాన్ని.. చిత్ర పరిశ్రమను, అక్కడి రాజకీయాలను శాసించారు. తనదైన ముద్ర వేశారు. ఏదేమైనా దేశ రాజీకాయాల్లో తన ప్రత్యేకతను చాటుకున్న కరుణానిధి తెలుగువారే కావడం మనందరికీ గర్వకారణం.

Similar News