జావాలో 189 మంది జల సమాధి

Update: 2018-10-30 04:54 GMT

ఇండోనేషియాలో విమానం గల్లంతయ్యింది. లయన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం జకార్తా నుంచి పంగకల్‌ పిన్నాంగ్‌‌ కు బయలుదేరింది. టేకాఫ్ అయిన 13 నిమిషాలకే విమానం కనిపించకుండా పోయింది. రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో విమానంలో సముద్రంలో కూలిపోయిందని  అధికారులు అనుమానించారు. విమానంలో 189 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. జావా సముద్రంలో ప్రయాణికుల వస్తువులు, జెట్ విడిభాగాలు కనిపించడంతో  అందరూ మరణించారు ఉంటారని  అధికారులు ప్రకటించారు. 

జావా సముద్రంలో రెస్క్యూ టీమ్స్‌ ఎమర్జెన్సీ బోట్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానం మెయిన్‌బాడీ కూలిన చోటు కోసం గాలిస్తున్నాయి. బ్లాక్‌బాక్సులు స్వాధీనం చేసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదానికి గురైన JT 610 విమానానికి ఢిల్లీకి చెందిన వ్యక్తి  పైలట్‌గా వ్యవహరించారు.  ఫ్లైట్‌ కెప్టెన్‌ భవ్యే సునేజా ఈ ప్రమాదంలో మరణించినట్టు జకార్తాలోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది.

Similar News