త‌న‌దైన శైలిలో న్యూఇయ‌ర్ కి విష‌స్ చెప్పిన కిమ్

Update: 2018-01-01 07:20 GMT

దేశాధినేత‌లు ఎవ‌రికి వారు..వారి వారి దేశ ప్ర‌జ‌ల‌కు నూత‌న‌సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెబుతుంటారు.  కానీ ఆ దేశాద్య‌క్షుడు మాత్రం త‌న‌దైన శైలిలో న్యూఇయ‌ర్ కి విష‌స్ చెప్పాడు. అమెరికాని నువ్వో కుక్క... అంటాడు. వాడో మెంటలోడు అని తేల్చేస్తాడు. నాతో పెట్టుకుంటే పుట్టగతులండవ్ అంటూ దుమ్మెత్తిపోస్తాడు. అలా అని అమెరికాలో కొంత బలవంతుడు కూడా కాదు. ఓ చిన్న దేశానికి పెద్ద నియంత. నా మాటే శాసనమంటూ ఫత్వాలు జారీచేసేంత పరమశాడిస్టు. ఎక్కడ ఏ పంచాయతీ జరుగుతున్నా, నాకేంటి లాభం? అని లెక్కలేసుకునే  ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను టార్గెట్ చేస్తూ న్యూఇయ‌ర్ కు స్వాగ‌తం ప‌లికాడు. నా టేబుల్ పై ఓ బ‌ట‌న్ ఉంది. అవ‌స‌రం అనిపిస్తే  దాన్ని నొక్కుతా..అణు బాంబు బయలుదేరుతుందని హెచ్చరించారు. అంతేకాదు త‌మ‌ద‌గ్గ‌ర అణ్వాయుదాలు ఉన్నాయ‌ని ప‌రోక్షంగా సంకేతాలిస్తూ  నేనేమీ బ్లాక్ మెయిల్ చేయడం లేదంటూ వ్యాఖ్య‌లు చేశాడు. ఇదిలా ఉంటే అమెరికాపై అణ్వాయుదాల్ని ప్ర‌యోగించేందుకు సిద్ధ‌మైన  కిమ్ చ‌ర్య‌ల్ని అమెరికా ఖండిస్తుంది.  ఉత్తర కొరియాపై ఆంక్ష‌లు ఉన్నా వాటిని బేఖాత‌రు చేయ‌ని కిమ్ తన అణు పరీక్షలకు కిమ్ కొనసాగిస్తు్న్నాడు. 

Similar News