వసుధైక కరుణ కుటుంబం... అదొక ప్రస్థానం

Update: 2018-08-08 07:00 GMT

దక్షిణ భారత సినిమా రంగానికి చెందిన వారిలో ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి. అన్నాదురై శిష్యుడిగా ఆయన ఆశయాలే వెన్నుదన్నుగా, ద్రవిడోధ్యమమే శ్వాసగా హేమాహేమీలను ఎదుర్కొని నిలిచారు. రాజకీయాలతో పాటు రచనలతో ప్రజలను మెప్పించి కలైంజర్ అనే బిరుదు పొందారు. జగమంత కుటుంబం నాది అనేవారు. అంతేకాదు కరుణానిధి కుటుంబం కూడా చాలా పెద్దది. ఆయనకు ముగ్గురు భార్యలు. ఆరుగురు సంతానం ఉన్నారు. 

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కరుణానిధికి కలైంజర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. కలైంజర్ అంటే స్కాలర్ ఆఫ్ ఆర్ట్స్ అని అర్థం. అంటే కళల గురించి పరిశోధనలు చేసే వాడు అని. కరుణను నిత్య పరిశోధకుడిగా అభిమానులు భావిస్తారు, అందుకే డా. కలైంజర్‌ అని బిరుదు ఇచ్చారు. తమిళ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసిన వ్యక్తి కరుణానిధి. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది.  

8వ తరగతివరకు మాత్రమే చదువుకున్న కరుణకు ఆది నుంచి ఉద్యమాలన్నా, సాహిత్యమన్నా ఎనలేని మక్కువ. 14వ ఏటనే నాటకాలు, కవిత్వం రాయడం ప్రారంభించారు. మూఢ విశ్వాసాల నుంచి, తనకు తెలిసిన ప్రపంచం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన చిన్ననాటి నుంచే రకరకాల నాటికలు వేసేవారు. విద్యార్ధిగా ఉన్నప్పుడు తమిళ సినిమాలకు స్క్రీన్‌ప్లే రాసేవారు. అలాగే సంభాషణలు రాసేవారు. ఇలా ఆయన కెరీర్‌లో మొత్తం 39 సినిమాలకు స్క్రిప్ట్‌ను అందించారు. ఇక నాస్తికవాదానికి మద్దతుగా కరుణ అనేక రచనలు చేసేవారు. తమిళకవి తిరువళ్ళువార్ రచించిన తిరుక్కురల్ కు తమిళ వ్యాఖ్యానాలు రాశారు. 1942లో ‘మురసోలి’ అనే పత్రికను కూడా నడిపారు. అందుకే ఎన్నో రంగాల్లో అసమాన ప్రతిభ ఉన్న కరుణను అభిబానులు కలైంజర్ అని పిలుస్తారు. 

కరుణానిధికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య పద్మావతి, రెండో భార్య దయాళు అమ్మాల్, మూడో భార్య రాజాది అమ్మాల్‌. కరుణానిధికి ముత్తు, అళగిరి, స్టాలిన్, తమిళరసు నలుగురు కుమారులు కాగా సెల్వి, కనిమొళి కుమార్తెలు. కరుణ మొదటి భార్య పద్మావతి యుక్తవయస్సులోనే కన్నుమూశారు. పద్మావతి కొడుకైన ఎంకే ముత్తు చిన్నతనంలోనే మృతి చెందారు. అళగిరి, స్టాలిన్, సెల్వీ, తమిళరుసు దయాళు అమ్మల్‌కు జన్మించారు. కనిమొళి రాజాది అమ్మల్‌కు జన్మించారు. అళగిరి, స్టాలిన్, కనిమొళి రాజకీయాల్లో ఉన్నారు

అయితే కరుణకు వయస్సు మీరడంతో రాజకీయ వారసుడు ఎవరనే విషయంలో పోటీ నెలకొంది. కరుణానిధి మాత్రం స్టాలిన్‌వైపే మొగ్గు చూపారు. అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. తనకు సరైన వారసుడు స్టాలినేనని కరుణ అనేక సార్లు ప్రకటించారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా స్టాలిన్‌ను నియమించారు. 

Similar News