క్రికెట్‌పై అపార 'కరుణ'...ధోనీ అంటే అంతులేని ఆదరణ

Update: 2018-08-08 05:59 GMT

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి గొప్ప రాజకీయవేత్త, సాహిత్యవేత్త మాత్రమే కాదు ఆయన గొప్ప క్రీడాభిమాని కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరుణానిధి క్రీడలకు అత్యంత ప్రధాన్యాన్ని ఇచ్చారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం సత్తా చాటిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించేవారు.

కరుణానిధి గొప్ప క్రీడాభిమాని ఆయనకు క్రికెట్ అంటే ఎనలేని ఇష్టమని సన్నిహితులు చెబుతారు రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే కరుణానిధికి క్రికెట్ అంటే ఎంతో అభిమానించేవారు కరుణానిధి తన జీవితంలో ఎప్పుడూ క్రికెట్ కోసం సమయాన్ని కేటాయించేవారని అతని కుమార్తె కనిమొళి గతంలో చెప్పారు.

క్రికెట్ మ్యాచులను చూడటానికి కరుణానిధి కొన్ని సార్లు తన సమావేశాలు రద్దు చేసుకునేవారిని చేసుకునేవారు. కరుణానిధికి కపిల్ దేవ్, శ్రీనాధ్, ధోనీ అంటే ఎంతో అభిమానం ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్ ధోనీకి తాను అభిమానని కరుణానిధి పలు సందర్భాల్లో స్వయంగా చెప్పారు.

ఇక ఆయన అస్వస్థతకు గురి కావడానికి ముందు ముని మనవడితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఆయన స్వగృహంలో వీల్‌ ఛైర్‌లోనే కూర్చొని క్రికెట్ ఆడారు. వీల్ ఛైర్‌కే పరిమితమైనప్పటికీ బౌలింగ్ వేసి పిల్లాడితో సరదాగా ఆడారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుండే కరుణానిధి 2011లో ప్రపంచ కప్ విజేతలైన టీమిండియాకు కరుణనిధి మూడు కోట్ల నజరానా కూడా ఇచ్చారు అంతే కాకుండా చెన్నై ఆటగాడు అస్విన్ కు కోటి రూపాయల బహుమతి అందించారు ఇక తొలి సారి ప్రపంచ ఛాంపియన్ అయినప్పుడు చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ను కూడా కరుణ సత్కరించారు. 

Similar News