వడ్డీ రేట్లు యథాతథం : ఆర్బీఐ

Update: 2017-12-13 09:33 GMT

మందగమనంలో ఉన్నవృద్ధికి ఊతం ఇచ్చేందుకు కీలక వడ్డీ రేట్లు తగ్గించాలన్న పారిశ్రామిక వర్గాల ఆశలపై ఆర్‌బీఐ నీళ్లు చల్లింది. ఆర్బీఐ స్నేహహస్తం ఇస్తుందని ప్రభుత్వ వర్గాలు సైతం ఆశించినప్పటికీ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సారథ్యంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ తెలిపింది. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు ప్రస్తుతం 6 శాతంగా ఉంది. దాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ఉర్జిత్ పటేల్ ప్రకటించారు.

Similar News