కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి భలే చాన్స్

Update: 2018-01-08 11:48 GMT

కేప్ టౌన్ టెస్ట్ రసపట్టుగా మారింది. రెండో ఇన్నింగ్స్ లో సైతం టీమిండియా బౌలర్లు చెలరేగిపోడంతో విరాట్ సేనను విజయం ఊరిస్తోంది. మ్యాచ్ నెగ్గాలంటే టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 208 పరుగులు
చేస్తే చాలు. వర్షం దెబ్బతో మూడోరోజుఆట రద్దైన తర్వాత నాలుగోరోజుఆటలో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీటీమ్ 41.2 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని టీమిండియా ఎదుట 208 పరుగుల లక్ష్యం ఉంచగలిగింది. సఫారీ ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్ 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత పేసర్లలో షమీ,బుమ్రా చెరో 3 వికెట్లు, పాండ్యా, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కేప్ టౌన్ వేదికగా ఇంతకు ముందు వరకూ ఆడిన నాలుగు టెస్టుల్లో టీమిండియాకు రెండు పరాజయాలు, రెండు డ్రాల రికార్డు మాత్రమే ఉంది. కొహ్లీ నాయకత్వంలో టీమిండియా 208 పరుగుల మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే చాలు. అయితే టీమిండియా టాపార్డర్లో ఒకరిద్దరు అసాధారణంగా రాణిస్తే విజయం ఏమంత కష్టంకాబోదు.

Similar News