నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా ఎమ్మెల్యే ప్రి రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తాడనే టాక్ బయట బాగా నడిచింది. కానీ ఆయన దీనికి హాజరు కాలేదు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ స్పందించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తారక్‌ను తానే వద్దని చెప్పానని కల్యాణ్ రామ్ తెలిపాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం కోసం కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నాడని, అది అభిమానులకు సర్ప్రైజ్ అని.. ఒకవేళ ఇప్పుడు ఫంక్షన్‌కు వస్తే ఆ లుక్ బయటపడుతుందనే ఉద్దేశ్యంతోనే వద్దని చెప్పానని పేర్కొన్నాడు. ఇక ఫంక్షన్‌కు వచ్చేముందు కూడా ఎన్టీఆర్‌ను కలిసే వచ్చానని.. ఈ కార్యక్రమానికి రాలేనందుకు అతడు చాలా ఫీల్ అయ్యాడని తెలిపాడు.