అఖిల్ హీరోగా ఈ నెల 22వ తేదీన 'హలో' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ అగ్రదర్శకుడు ప్రియదర్శన్, మాజీ హీరోయిన్ లిసిల ముద్దుల కూతురు కల్యాణి. ఈ సినిమా ద్వారా కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాలో అఖిల్ సరసన మెరిసిన ఈ అమ్మాయికి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో అంతా "కల్యాణి.. ఐ హేట్ యూ" అంటూ వరుసగా మెసేజ్ లు పెట్టేస్తున్నారట.
నటన బాగుంటే.. `ఐ హేట్ యూ` అని ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? దానికో కారణముంది. `హలో` సినిమాలో దర్శకుడు చెప్పిన లాజిక్ ప్రకారం.. `ఐ లవ్యూ` అంటే `ఎవరెస్ట్ అంత ప్రేమ` అని అర్థం. `ఐ హేట్ యూ` అంటే `ఆకాశమంత ప్రేమ` అని అర్థం. అంటే `ఐ లవ్యూ` కంటే `ఐ హేట్ యూ` అని చెబితేనే ఎక్కువ ప్రేమిస్తున్నట్టు అర్థం. అందుకే అందరూ దర్శకుడు విక్రమ్ లాజిక్నే ఫాలో అయిపోతూ సినిమాలో అద్భుతంగా నటించిన కల్యాణికి `ఐ హేట్ యూ` అని మెసేజ్లు పంపుతున్నారట.