పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న ఎన్నో సంవత్సరాల తరువాత మరో పెళ్లికి సిద్ధపడ్డ రేణూ దేశాయ్...గత జ్ఞాపకాలని వదిలేసి..కొత్త జీవితం వైపు అడుగులేస్తోంది..రేణు దేశాయ్. మరికొద్ది రోజుల్లో మరో వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇటీవలె రేణు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన రేణు తనకు కాబోయే భర్త ఫోటోలను మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా తన రెండో వివాహం గురించి ఓ ఆంగ్ల పత్రికతో రేణు మాట్లాడారు.
ఇది పూర్తిగా సన్నిహితులు కుదిర్చిన పెళ్లి. చాలా సంతోషంగా ఉన్నాను. అయితే అంత ఆతృత మాత్రం లేదు. ప్రేమ అనేది జీవితంలో ఒకసారే కలుగుతుంది. మళ్లీ మళ్లీ ప్రేమలో పడడం జరగదు. గత ఏడేళ్లుగా నేను ఒంటరిగానే ఉన్నాను. అప్పుడూ సంతోషంగానే ఉన్నాను. పెళ్లి చేసుకున్నా నేను అంతే సౌకర్యంగా ఉండగలననే నమ్మకం కలిగింది. ఆయన చాలా ప్రశాంతమైన వ్యక్తి. మళ్లీ సహజీవనం చేయాలని నేను అనుకోలేదు. అందుకే సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాన`ని రేణు చెప్పారు.