హైకోర్టు తీర్పు రిజర్వ్‌

Update: 2018-10-10 11:48 GMT

తెలంగాణ అసెంబ్లీ రద్దు రాజ్యాంగ బద్ధంగా జరగలేదంటూ దాఖలైన పిటిషన్లపై  తీర్పును  హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది.  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణతో పాటు శశంక్‌రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ రోజు వాడివేడిగా వాదనలు జరిగాయి. శాసనసభటను సమావేశపరచకుండా అసెంబ్లీని రద్దు చేయడం వల్ల సభలోని సభ్యులకు ఈ విషయం తెలియలేదంటూ పిటిషనర్ల  తరపు న్యాయవాదులు వాదించారు.  అయితే ప్రభుత్వానికి బాధ్యత వహించే మంత్రి మండలి ఆమోదంతోనే సభను రద్దు చేసినట్టు అడ్వకేట్ జనరల్‌ కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది.  

Similar News