వైఎస్‌ జగన్‌పై హత్యయత్నం కేసులో కీలక అంశాలను ప్రస్తావించిన హైకోర్టు

Update: 2018-11-13 08:27 GMT

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో హైకోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది.  కేసు విచారణ ధర్డ్ పార్టీకి అప్పగించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. కేసు విచారణ ప్రారంభం కాగానే సిట్ అధికారులు కేసు విచారణ నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా దాడి జరిగిన రోజు విమనాశ్రయంలోని సీసీ పుటేజీ ఎక్కడుందంటూ హైకోర్టు ప్రశ్నించింది. అయితే గత మూడునెలలుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ  ఎయిర్ ఫోర్ట్‌ సీసీ టీవీ కోర్ టీం కోర్టుకు తెలిపింది. అధికారుల సమాధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం సీసీ పుటేజీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉంటుందో చెప్పాలంటూ ప్రశ్నించింది.  దీంతో సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. ఈ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్ధానం విశాఖ ఎయిర్‌పోర్టులో భద్రత లోపాలు క్షమించరానివంటూ వ్యాఖ్యానించింది. 

Similar News