జైలు నుంచి విడుదలైన నటుడు సామ్రాట్

Update: 2018-02-01 05:45 GMT

భార్య ఫిర్యాదుతో దొంగతనం, వేధింపుల కేసులో అరెస్టయిన టాలీవుడ్ కుర్రహీరో సామ్రాట్‌‌రెడ్డి ఎట్టకేలకు బెయిల్‌పై విడుదలయ్యాడు. సమ్రాట్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. ఇంట్లో దొంగతనం చేశాడు, డ్రగ్స్‌కు బానిసై హింసించాడు, వరకట్నం కోసం వేధించాడంటూ సినీనటుడు సామ్రాట్‌రెడ్డిపై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాదాపూర్‌ పోలీసులు అతడిని మంగళవారం అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. కూకట్‌పల్లి కోర్టులో సామ్రాట్‌రెడ్డి తరపు న్యాయవాది బెయిల్‌ కోసం పిటిషన్‌ వేయగా... కేసు విచారించిన న్యాయమూర్తి మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతోపాటు రూ.25 వేలు డిపాజిట్‌ చెల్లించాలని ఆదేశించారు. ప్రతి శనివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని సూచించారు.


 

Similar News