హీరో నాని కారుకు ప్రమాదం

Update: 2018-01-26 12:31 GMT

టాలీవుడ్ హీరో నానికి చెందిన కారుకు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ రోడ్ నం.45లో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ శ్రీనివాస్ నిద్ర మత్తులో నడవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. ప్రమాదం సమయంలో కారులో హీరో నాని తండ్రి రాంబాబు ఉన్నారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం కోలుకున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News