ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా ఈ బుడతడు..!

Update: 2017-12-13 09:37 GMT

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ పారిశ్రామికత సదస్సు మరి కాసేపట్లో  ప్రారంభం అయింది.. ఈ సదస్సుకు  ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్, తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో పాటు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాల్గొంటున్నారు. ఇనె్వస్టర్లు, పారిశ్రామిక వేత్తలు, విజ్ఞానాధారిత ప్రదాన పరిశ్రమల ముఖ్య కార్యనిర్వాహణాధికారులు కూడా హాజరవుతున్నారు. ప్రపంచం నలుమూలల నుండి 160 దేశాల ప్రతినిధులు వస్తున్నారు. అందులో దాదాపు 10 దేశాల నుండి పూర్తిగా మహిళా బృందాలే రానున్నాయి. ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించడంలో భారత ప్రభుత్వం పక్షాన నీతి ఆయోగ్ ముఖ్య పాత్రను పోషిస్తోంది.

 కాగా ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా  హమీష్‌  ఫిన్లేసన్ (13) అతిచిన్న పారిశ్రామిక వేత్తగా క్రెడిట్‌ దక్కించుకున్నాడు.   7వ తరగతి చదువుతున్న  ఆస్ట్రేలియన్-ఆధారిత ఎంట్రపెన్యూర్‌  అతిచిన్న డెలిగేట్‌గా తన  ప్రత్యేకతను చాటనున్నారు.  గేమింగ్‌  అండ్‌ అవేర్‌నెస్‌పై  తాను రూపొందించిన యాప్‌లను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా తాబేళ్లను రక్షించే ప్రాజెక్టులో ఇప్పటివరకు ఐదు  యాప్‌లను హమీష్‌ అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన  కల్పించేందుకు గాను ఆరవ యాప్‌ను పనిచేసే పనిలో  ఉన్నాడు. తాను  భారతదేశం రావడం చాలా సంతోషంగా ఉందని  ఫిన్లేసన్  తెలిపారు.

Similar News