బద్దలైన అగ్నిపర్వతం.. 25మంది మృతి

Update: 2018-06-04 07:08 GMT

అమెరికా దేశమైన గ్వాటెమలలోని ఫ్యూగో అగ్ని పర్వతం పేలింది. దీంతో 25 మంది మృత్యువాత పడగా.. 20 మందికిపైగా గాయపడ్డారు. కొన్ని వేల మందిని అక్కడి నుంచి తరలించారు. నదిలా ప్రవహిస్తున్న లావా చుట్టుపక్కల ప్రాంతాలను దహించి వేసింది. ఆకాశంలో పది కిలోమీటర్ల ఎత్తున దట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఈ అగ్నిపర్వతం పేలడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.గ్వాటెమాలా జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

సెంట్రల్‌ అమెరికా ప్రాంతంలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఫ్యూగో అగ్నిపర్వతం ఆదివారం బద్దలైంది. దీంతో పెద్ద పెద్ద రాళ్లు ఎగిరి పడుతున్నాయి. దట్టమైన పొగ వ్యాపించింది. అగ్నిపర్వతం నుంచి లావా ఎగసిపడి సమీపంలోని గ్రామాల వరకు వ్యాపించింది. ఈ లావాలో పలువురు స్థానికులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మంది మృతిచెందగా.. మరో 20మందికి పైగా గాయపడినట్లు వెల్లడించారు.

Similar News