సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాలో వెన్నుపోటు అనే పాట ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు వర్మ. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే సంచలనం సృష్టించిన వర్మ ఇప్పుడు వెన్నుపోటు పోస్టర్నుఎలా డిజైన్ చేశాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు.
The first look of వెన్ను పోటు Song from Lakshmi’s NTR will release on December 21st at 4 PM
— Ram Gopal Varma (@RGVzoomin) December 19, 2018