అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

Update: 2018-12-01 07:26 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ H.W బుష్‌ కన్నుమూశారు. అమెరికాకు 41వ అధ్యక్షుడిగా పనిచేసిన బుష్ 94 ఏళ్లు. బుష్‌ సతీమణి బార్బరా గత ఏప్రిల్‌లో మరణించారు. రిపబ్లికన్‌ పార్టీ నేత అయిన జార్జ్‌ H.W బుష్‌ ..1989 నుంచి 1993 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. 1981 నుంచి 1989 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. జార్జ్‌ H.W బుష్‌ను అమెరికా విదేశాంగ విధాన వ్యూహకర్తగా పేర్కొంటారు. జార్జ్‌ H.W బుష్‌ పెద్ద కొడుకైన జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ కూడా అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. మసాచుసెట్స్ లోని మిల్టన్ లో 1924, జూన్ 12న బుష్ జన్మించారు. కేవలం 18 సంవత్సరాలకే అమెరికా నావికాదళంలో చేరి పిన్న వయస్కుడైన పైలెట్ గా బుష్ అప్పట్లోనే చరిత్ర సృష్టించారు. జార్జ్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామ, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 


 

 

 

Similar News