బిగ్ బాస్2: మరో షాక్ ఇచ్చిన నాని.. ఎలిమినేట్ అయిన వారిలో ఒకరు మళ్ళీ హౌస్‌లోకి!
‘బిగ్‌బాస్ సీజన్ 2 ఏదైనా జరగొచ్చు’ అన్నట్లే ఊహించిన విధంగా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు హోస్ట్ నాని. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎవరైన కొత్తవారు వస్తారని అందరూ భావించారు.. ఈ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని పటా పంచల్ చేస్తూ బిగ్‌బాస్ ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. ఇప్పటి వరకు మీ ఫేవరేట్ హౌస్ సభ్యుడు ఎలిమినేట్ కాకుండా ఓటింగ్ వేశారు. ఇప్పుడు ఎలిమినేట్ అయిన మీ ఫెవరెట్ సభ్యుడిని తిరిగి హౌస్ లోకి పంపేందుకు ఓటింగ్ చేయవచ్చు అని నాని ప్రకటించాడు. ఇప్పటి వరకు హౌస్ నుంచి సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వి ఎలిమినేట్ అయ్యారు. వీరిలో ఒకరు తిరిగి హౌస్ లోకి ప్రవేశించే అవకాశం దక్కింది. కానీ నిర్ణేతలు మాత్రం ఆడియన్సే.