తాను 62 గెటప్పుల్లో కనిపించబోతున్నానంటూ నందమూరి నటసింహం బాలకృష్ణ షాకిచ్చారు. దశావతరాం సినిమాల్లో కమల్ హాసన్ పది అవతారల్లో అలరించారు. ఇప్పుడు బాలయ్య 62 పాత్రలు అలరించనున్నట్లు తెలుస్తోంది. 62 పాత్రలే అయినా గెటప్ ఒకటేనని అంటున్నారు బాలకృష్ణ. గత రెండు సంవ్సరాల నుంచి బాలకృష్ణ డైరక్టర్ తేజ ఎన్టీఆర్ బయోపిక్ లో కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో బయోపిక్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పిన బాలయ్య ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుందని అన్నారు.
అంతేకాదు తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని అనేకోణాల్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక తండ్రి మిత్రులు, శత్రువులు సైతం ఈ బయోపిక్ లో ప్రత్యక్షమవుతారని వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ గురించి అన్నీంటిని సినిమాలో చూపిస్తున్నట్లు చెప్పినన బాలయ్య.. నేను 62 గెటప్పుల్లో కనిపించబోతున్నా. అవేంటన్నది ఇప్పుడే చెప్పను. బాలయ్యగా నా పాత్ర కూడా ఇందులో ఉంటుంది. కానీ నేనుండేది ఒకట్రెండు సన్నివేశాల్లో మాత్రమే’’ అని బాలయ్య అన్నాడు.