తెలుగు తెరపై అమ్మ .. అక్క .. వదిన పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో సుధ ముందు వరుసలో కనిపిస్తుంది. అలాంటి సుధ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అలీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా హీరో ఉదయ్‌కిరణ్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది.
‘‘ఉదయ్‌కిరణ్ హీరో కాకముందు నుంచే నాకు తెలుసు. చాలా సినిమాల్లో వాడికి అమ్మగా నటించా. చాలా మంచి వాడు. ఎవరికైనా సహయం చేయలని చూసేవాడు. ఉదయ్ కిరణ్‌ను నేను దత్తత తీసుకోవాలని భావించాను కానీ ఈ లోపే వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ చాలా డల్‌గా ఏదో పొగొట్టుకున్నావాడిలా ఉండేవాడు. నేను ఓ రోజు పిలిచి అడిగితే మీతో చాలా చెప్పాలి అమ్మ అన్నాడు. కానీ ఇప్పుడు కాదు నేనే మన ఇంటికి వస్తాను అన్నాడు. అలా చెప్పిన కొన్ని రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ చనిపొతే నా సొంత కొడుకు చనిపోయినట్లు ఉంది. ఒకవేళ నేను దత్తత తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదేమో’’ అని కన్నీటి పర్యంతమయ్యారు సుధ.