దక్షిణాదిలో 50కి పైగా సినిమాల్లో నటించిన దివ్యఉన్ని రెండో పెళ్లి చేసుకొని అందరినీ షాక్‌కి గురిచేసింది. అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అరుణ్ కుమార్ మణికందన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. హ్యూస్టన్‌లోని గురువయప్పన్ ఆలయంలో ఈ శుభకార్యం జరిగింది. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లి గురించి దివ్య అధికారికంగా ప్రకటించారు. తమకు శుభాకాంక్షలు చెప్పిన వారికి ధన్యవాదాలు తెలిపారు. పెళ్లిలో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా తీసిన మరికొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా గతంలో ఈమె అమెరికాకే చెందిన ఓ వైద్యుడిని వివాహం చేసుకుంది. వీరికి అరుణ్, మీనాక్షి అనే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.14 ఏళ్ల వయసుకే చిత్ర పరిశ్రమకు పరిచయమైన దివ్య దక్షిణాదిలోని వివిధ భాషల్లో 50 సినిమాలకుపైగా నటించారు. మలయాళంలో మోహన్‌లాల్, మమ్ముట్టి, దిలీప్ వంటి స్టార్స్ సరసన నటించారు. 2013లో వచ్చిన ‘ముసాఫిర్’ ఆమె తెరపై కనిపించిన చివరి చిత్రం. తెలుగులో ఆమె ‘ఇల్లాలు ప్రియురాలు’ అనే సినిమాలో నటించారు. ఇందులో వేణు, జయసుధ, ప్రకాశ్‌రాజ్, భానుప్రకాశ్ ప్రధాన పాత్రలు పోషించారు. నటిగానే కాదు నృత్యకారిణిగా కూడా దివ్యకు మంచి గుర్తింపు ఉంది. అనేక అంతర్జాతీయ, జాతీయ షోలలో ఆమె పాల్గొన్నారు.