ఒకేసారి ఎనిమిది మందితో మాట్లాడేలా..వాట్సప్ గ్రూప్ కాలింగ్!

కరోనా వైరస్ తో ఎక్కడి వారక్కడ ఉండిపోయారు. సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు ఎక్కువగా మొబైల్ యాప్ ల పైనే ఆధారపడుతున్న పరిస్థితి.

Update: 2020-04-29 02:57 GMT
WhatsApp logo

కరోనా వైరస్ తో ఎక్కడి వారక్కడ ఉండిపోయారు. సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు ఎక్కువగా మొబైల్ యాప్ ల పైనే ఆధారపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా చిన్న చిన్న కంపెనీలలో ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న వారు వారి టీముల మధ్య సమాచారాన్ని పంచుకోవడం, పనులను సమంవ్యపరుసుకోవడం కోసం వివిధ యాప్ లలోని గ్రూప్ కాలింగ్ పై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రూప్ కాలింగ్ యాప్ లు అన్నీ కొంత సంక్లిష్టతతో కూడినవి.

అయితే, వాట్సప్ లో కాలింగ్ విధానం చాలా సరలతరంగా ఉంటుంది. కానీ దీని ద్వారా ఇప్పటివరకూ గరిష్టంగా నలుగురు మాత్రమే ఒకేసారి మాట్లాడుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు వాట్సప్ తాజాగా ఈ సంఖ్యను 8 కి పెంచుతూ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ మేరకు వాట్సప్ ఒక ప్రకటన విడుదల చేసింది. ''కరోనా నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాట్సప్‌ ద్వారా వాయిస్‌ లేదా వీడియో కాల్‌ చేయడం బాగా పెరిగింది. మరింత ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం కావాలని వినియోగదార్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో గతంలో ఉన్న గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాల్‌ పరిమితిని రెట్టింపు చేశాం'' అని వాట్సప్‌ పేర్కొంది.


Tags:    

Similar News