Ola, Uber: ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం షాక్.. స్మార్ట్ ఫోన్, యాపిల్ ఫోన్ల మధ్య రేట్లలో తేడాలు ఎందుకు?
Ola, Uber Get Notice : యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా, ఉబర్ సంస్థలకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది. ఫోన్ మోడల్ బట్టి ఎక్స్‌ట్రా ఛార్జీలు విధిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఆయా సంస్థలకు నోటీసులు పంపించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ అందిస్తున్న ఓబేర్, ఓలా సంస్థలకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఆయా సంస్థల ప్రైసింగ్ పాలసీపై ఇటీవల ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. క్యాబ్ సర్వీస్ లు అందిస్తున్న సంస్థలు ఫోన్ రకం, ధరలను బట్టి చార్జీలు వసూలు చేస్తున్నాయి అంటూ ఆరోపణలు వచ్చాయి. అలాగే లో బ్యాటరీ ఉన్న ఫోన్ తో బుక్ చేస్తే ఎక్కువ ఛార్జిలు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు.
ఆండ్రాయిడ్ ఫోన్ కి ఒక ధర, ఐఫోన్ కు అయితే ఒక ధర ఉండడమే కాకుండా.. ఫోన్ ధరను బట్టి ధరల్లో తేడా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి విచారణ ఇవ్వాలని ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఒకేసారి రెండు కంపెనీలు వేర్వేరుగా చార్జీలు వసూలు చేస్తున్నాయి అన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ విషయంపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ చర్యలు చేపట్టింది.
ఒకేసారి సర్వీసుకు రెండు వేరువేరు ధరలు ఎలా నిర్ణయిస్తారో చెప్పాలని ఆ సంస్థలను కోరింది. చార్జీలో తేడాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొంది. చార్జీల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు సరైన వివరణ ఇవ్వాలంటూ స్పష్టం చేసింది.
కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి చెందిన రిషబ్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్ కాస్త వైరల్ అయింది. క్యాబ్ సర్వీస్ లో అందించే ఉబర్ సంస్థ ఫోన్ రకం తో పాటు అందులో ఉంటే బ్యాటరీ పర్సంటేజ్ ని బట్టి చార్జీల్లో వ్యత్యాసం చూపిస్తుందంటూ ఆయన ఆరోపించారు. రెండు ఆండ్రాయిడ్, రెండు ఐఫోన్లు ఉపయోగించి పరిశీలించినప్పుడు ఈ విషయాన్ని గుర్తించినట్లు ఫోటోలతో పాటు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశాడు. అన్ని డివైస్ల్లో ఒకే ఖాతాలో లాగిన్ అయితే ఒకే ప్రాంతానికి రైడ్ బుక్ చేసిన చార్జీల్లో చాలా వ్యత్యాసం ఉందని గుర్తించినట్లు రాసుకొచ్చారు. ఈ తరహా ఫిర్యాదులపై సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.