స్వల్పంగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు..

గత రెండు రోజులుగా లాభాల బాటలో ఉన్న స్టాక్ మార్కెట్ కు ఈరోజు బ్రేక్ పడింది.

Update: 2020-02-13 12:04 GMT

గత రెండు రోజులుగా లాభాల బాటలో ఉన్న స్టాక్ మార్కెట్ కు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలు నమోదు చేశాయి. ఈరోజు ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి కూడా అదే ధోరణి కొనసాగించాయి. దీనితో బిఎస్సీ సన్ సెక్స్ 106 పాయింట్లు నష్టపోయింది అదేవిధంగా నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయింది bsesensex 41,459 వద్ద, నిఫ్టీ 12,176 పాయింట్ల వద్ద ముగించాయి.

ఇకపోతే, ఇకపోతే యూస్ డాలర్తో రూపాయి మారకం విలువ లో మార్పురాలేదు. 71. 33 పైసలు వద్ద రూపాయి కొనసాగుతోంది. డిసెంబర్ లో పారిశ్రామికోత్పత్తి క్షీణించింది అన్న వార్తలు రావడం, జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఆరేళ్ల కనిష్టానికి చేరుకోవడం స్టాక్ మార్కెట్ల పై ప్రభావం చూపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం కూడా మార్కెట్లపై కనిపిస్తోందని అంటున్నారు.


Tags:    

Similar News