నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Update: 2020-04-08 13:22 GMT
stock market today (representaional image)

నిన్న రికార్డు స్థాయిలో లాభాలు సృష్టించిన షేర్ మార్కెట్లు ఈరోజు (బుధవారం, ఏప్రిల్ 8) నష్టాల్లో ముగిశాయి. కరోనా కేసులు తగ్గుతున్నయన్న వార్తలు.. కేంద్రం మరోసారి ఉద్దీపనలు ప్రకటించవచ్చన్న ఊహా గానాల మధ్య నిన్న స్టాక్ మార్కెట్లు పైకేగాసాయి. అయితే, ఈరోజు మళ్ళీ కరోనా ఉధృతి పెరిగినట్టు తేలడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.

ఈరోజు ఉదయం నుంచీ మార్కెట్లు ఊగిసలాట ధోరణిలోనే కొనసాగాయి. ఉదయం ప్రారంభం అవుతూనే సెన్సెక్స్ 271.60 పాయింట్లు (0.90%) నష్టంతో 29,795.61 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభం అయింది. అదేవిధంగా నిఫ్టీ కూడా 78.85 పాయింట్లు (0.90%) దిగువన 8,713.35 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. తరువాత రెండు సూచీలు స్వల్ప లాభాల్లోకి వచ్చినప్పటికీ.. సాయంత్రం అయ్యేటప్పటికి నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ 173 పాయింట్ల నష్టంతో 29,894 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 8,748 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.34 వద్ద ముగిసింది.  

Tags:    

Similar News