Samsung Galaxy A71 5G వచ్చేస్తుంది.. దాని ధర ఎంతంటే?

స్మార్ట్ ఫోన్ తయారి సంస్థ శాంసంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయడానికి సిద్దం అవుతుంది.

Update: 2020-04-09 05:54 GMT
Samsung Galaxy (File Photo)

స్మార్ట్ ఫోన్ తయారి సంస్థ శాంసంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయడానికి సిద్దం అవుతుంది. శాంసంగ్ తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ71కు 5జీ వేరియంట్ ను ముందుగా చైనాలో లాంచ్ చేసి తరువాత ఇతర దేశాలలో కూడా లాంచ్ చేయనున్నారు. అసలు ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను చూసుకుంటే గెలాక్సీ ఏ71 పాత వెర్షన్లో ఉన్న ఫీచర్లనే ఇందులోనూ అందిస్తున్నారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఈ ఫోన్ లో ఉండనుందంటున్నారు. 980 ప్రాసెసర్ ను కూడా అందించే అవకాశం కూడా ఉంది. ఇక 4370 ఎంఏహెచ్ బ్యాటరీని చైనా సర్టిఫికేషన్ సైట్ టెనా తెలిపిన వివరాల ప్రకారం అందించనున్నారు.

ఈ ఫోన్ కోనుక్కోవాలనుకునే వారు తమ ఫేవరెట్ కలర్లను ఎంచుకోవచ్చు. బ్లూ, బ్లాక్, తెలుపు రంగుల్లో ఫోన్ లు మార్కెట్లోకి రానున్నాయి. ఇక ధర విషయానికొస్తే ఇండియాలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ చైనాలో మాత్రం 3500 యువాన్లు ఉండే అవకాశం ఉంది. అంటే మన భారతదేశ కరెన్సీ ప్రకారం సుమారు.37,800వేలు అన్న మాట. అయితే దీని ధర స్థిరంగా కాకుండా దేశాన్ని బట్టి మారనున్నాయి. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్లలోకి లాంచ్ అవుతుందో స్పష్టంగా చెప్పలేం. ప్రస్తుతం కరోనా వైరస్ కథ ముగిసిన తరువాతే ఈ ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారనే సమాచారం.


Tags:    

Similar News