Digital payments : ముందంజలో ఫోన్ పే

Update: 2019-12-14 12:12 GMT
ప్రతీకాత్మక చిత్రం

మనీ పర్సు చేతిలో లేకపోయినా  స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు బయటికి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు, ఏ షాపింగ్ అయినా చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ పెరిగిపోతున్న టెక్నాలజీతో ఇది సాధ్యం అవుతుంది. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ ద్వారా నగదు వ్యవహారాలు అన్నీ ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్ ద్వారానే చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ యాప్ ల ద్వారానే అధికంగా లావాదేవీలు నడుస్తున్నాయి. ఏడాది ఏడాదికి ఈ లావాదేవీల సంఖ్య పెరిగిపోతుంది. రానున్న కాలంలో కాసులు, కరెన్సీ అనేవి కంటపడని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇదే కోణంలో చూసుకుంటే డిజిటల్ పేమెంట్ యాప్ లలో ఫోన్‌పే ఆర్థిక లావాదేవీల్లో ముందుంది. ఈ సందర్భంగా ఫోన్ పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగం మాట్లాడుతూ గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఫోన్ పే ద్వారా లావాదేవీలు అధిక మొత్తంలో జరిగాయన్నారు. గతేడాది నవంబర్ వరకు 1 బిలియన్ లావాదేవీలను వినియోగదారులు ఈ యాప్  ద్వారా  జరిపించారన్నారు. ఈ ఏడాది వరకు దాని సంఖ్య 5 రెట్లు పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. 2018-19సంవత్సరంలో ఆ యాప్‌ను ఉపయోగించి 5 బిలియన్ల కంటే ఎక్కువ లావాదేవీలను జరిపారన్నారు. ఈ యాప్ ను వాడుతున్న తన కస్టమర్ల కోసం మరిన్ని సదుపాయాలను అందిస్తామని ఆ‍యన తెలిపారు.

దేశంలోని 215కు పైగా నగరాలు, పట్టణాల్లో సుమారుగా 80 లక్షల మంది మధ్య, సూక్ష్మ తరహా వ్యాపారులు చెల్లింపుల కోసం ఫోన్‌పేను వాడుతున్నారని ఫోన్ పే యాప్ సంస్థ తెలిపింది. ఇక ఈ యాప్ ను భారతీయుల్లో 175 మిలియన్లకు పైగా కలిగి ఉన్నారు. అందులో బ్యాంక్ ఖాతాలను కేవలం 150 మిలియన్ల మంది మాత్రమే లింక్ కలిగి ఉందన్నారు.




Tags:    

Similar News