Today Petro Price: ఎనిమిదో రోజూ అదే తీరు.. పెట్రోల్, డీజిల్ ధరలలో భారీ పెరుగుదల!

కనీ కనిపించకుండా పెట్రోల్ మంట పెట్టింది. ఈ ఎనిమిది రోజుల్లోనూ రెండు రూపాయలు పెరిగి కూచుంది. ప్రతి రోజూ 25-30 పైసల మధ్య పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఈ రోజూ పెరిగాయి. ఇక డీజిల్ కూడా అదే దారిలో ఉంది. ఈ ఎనిమిది రోజుల్లోనూ 1.63 పైసలు పెరిగింది.

Update: 2019-09-24 03:58 GMT

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఎనిమిదో రోజూ భారీగా పెరిగాయి. మెల్లగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఏడాది గరిష్టానికి చేరుకున్నాయి. ఇక డీజిల్ కూడా ఏడు నెలల గరిష్ట స్థాయిని అందుకుంది. ఈ ఎనిమిది రోజుల్లోనే పెట్రోల్ 2 రూపాయలు, డీజిల్ 1.63 రూపాయలూ పెరగడం షాక్ ఇస్తోంది.

ఇక సోమవారం తో పోలిస్తే మంగళవారం పెట్రోల్ 23 పైసలు, డీజిల్ 15 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 78.80 రూపాయలకు చేరింది. డీజిల్ 73.11 రూపాయలైంది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి 78.47 రూపాయలు గానూ, డీజిల్ ధర 14 పైసలు పెరిగి 72.44 రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి రూ.78.10, డీజిల్ ధర 15 పైసలు పెరిగి 72.10 రూపాయలకు చేరుకుంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 22 పైసలూ, డీజిల్ 15 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 79.72రూపాయలు, డీజిల్ 70.37 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 22 పైసలూ, డీజిల్ 14 పైసల మేర పెరగడంతో పెట్రోల్ ధర 74.13 రూపాయలుగానూ, డీజిల్ ధర 67.07 రూపాయలుగానూ ఉంది.


Tags:    

Similar News