స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అంతర్జాతీయంగా క్రూదాయిలు ధరల్లో పెరుగుదల దేశీయంగానూ ప్రభావం చూపించింది. సోమవారం తో పోల్చుకుంటే మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పంగా లీటరుకు 5 పైసలు పెరిగాయి.

Update: 2019-09-10 02:03 GMT

అంతర్జాతీయంగా క్రూదాయిలు ధరలు సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం మరికొంత పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం కంటే మంగళవారం పెట్రోల్, డీజిల్ రెండూ 5 పైసల మేర పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 76.23 రూపాయల నుంచి 76.28 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ 70.96 రూపాయల నుంచి 71.01 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా అమరావతిలోనూ 5 పైసల పెరుగుదల చోటుచేసుకుంది. దీంతో సోమవారం పెట్రోల్ ధర 75.98 రూపాయలు, డీజిల్ 70.37 ఉండగా అవి వరుసగా 76.03, 70.42 రూపాయలకు చేరుకున్నాయి. ఇక విజయవాడలో మంగళవారం పెట్రోల్ ధర 75.66 రూపాయలు, డీజిల్ 70.08 రూపాయలుగా ఉంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ డీజిల్ ధరలు 5 పైసల వంతున పెరిగాయి. ముంబయిలో పెట్రోల్ ధర 77.45రూపాయలు, డీజిల్ 68.31రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 71.76రూపాయలుగానూ, డీజిల్ ధర 65.14రూపాయలుగానూ ఉంది.

ఇక అంతర్జాతీయంగా క్రూదాయిలు ధరలు సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం పైకి ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిలు ధర 62.97 డాలర్లు (0.61 శాతం పెరుగుదల) గానూ, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 58.28 డాలర్లు (0.74 శాతం పెరుగుదల) గానూ ఉన్నాయి.


Tags:    

Similar News