Petrol Price Today 23.10.2019: నిలకడగా పెట్రోల్ ధరలు.. డీజిల్ ధరల్లోనూ మార్పు లేదు!

నిన్న స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. 23.10.2019 బుధవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర మార్పులు లేకుండా పెట్రోల్ ధర 77.86 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిల్ ధర కూడా 72.09 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

Update: 2019-10-23 03:39 GMT

నిన్న స్వల్పంగా  తగ్గిన  పెట్రోల్ ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి.  23.10.2019 బుధవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర మార్పులు లేకుండా పెట్రోల్ ధర 77.86 రూపాయల వద్ద నిలిచింది. ఇక  డీజిల్ ధర కూడా 72.09 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర లో ఎటువంటి మార్పూలేకుండా  77.47 రూపాయలు గా ఉంది. ఇక డీజిల్ ధర కూడా 71.38 రూపాయల వద్ద నిలకడగా ఉంది.  ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర , డీజిల్ ధర ల్లో ఎటువంటి మార్పులూ చోటు చేసుకోలేదు. దీంతో  పెట్రోల్ ధర లీటరుకు 77.10, డీజిల్ ధర లీటరుకు 71.04 రూపాయల వద్ద స్థిరంగా నిలిచాయి. 

దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడా  పెట్రోల్ ధర 73.22 రూపాయలు , డీజిల్ ధర లీటరుకు 66.11 రూపాయలుగా నిలిచాయి.  వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర 78.83 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.29 రూపాయలుగానూ ఉన్నాయి. 

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


Tags:    

Similar News