Petrol Price Today: స్వల్పంగా తగ్గిన పెట్రోల్..డీజిల్ ధరలు!

కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా పై పైకి ఎగబాకిన పెట్రోల్ ధరలు కొద్దిగా నెమ్మదించాయి. ఇక దేశీయంగా వరుసగా ఆరురోజుల పాటు తగ్గుతూ వచ్చి బుధవారం స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి.

Update: 2019-10-10 02:44 GMT

కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా పై పైకి ఎగబాకిన పెట్రోల్ ధరలు కొద్దిగా నెమ్మదించాయి. ఇక దేశీయంగా వరుసగా ఆరురోజుల పాటు తగ్గుతూ వచ్చి బుధవారం స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 

హైదరాబాద్ లో గురువారం పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు, డీజిల్ ధర లీటరుకు 6 పైసలు తగ్గింది. దీంతో లీటరు పెట్రోల్ ధర 78.20 రూపాయలు, డీజిల్ ధర 72.79 రూపాయలుగానూ నిలిచింది. అమరావతిలోనూ పెట్రోల్ ధర, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు, డీజిల్ ధర లీటరుకు 7 పైసలు తగ్గింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర 77.80 రూపాయలవద్ద, డీజిల్ ధర 72.05రూపాయలుగానూ ఉంది. అదేవిధంగా విజయవాడలో కూడా గురువారం పెట్రోల్ ధర లీటరుకు 6 పైసలు, డీజిల్ ధర లీటరుకు 6 పైసలు తగ్గింది. పెట్రోల్ 77.43 రూపాయలు డీజిల్ 71.71 రూపాయలుగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగానూ పెట్రోల్ ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి.ముంబాయిలో పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు, డీజిల్ ధర లీటరుకు 6 పైసలు తగ్గింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర 79.15 రూపాయలు, డీజిల్ ధర 69.97 రూపాయలుగానూ ఉంది. అదేవిధంగా దిల్లీలో కూడా పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు, డీజిల్ ధర లీటరుకు 6 పైసలు తగ్గింది. పెట్రోల్ ధర 73.54 రూపాయలు, డీజిల్ 66.75 రూపాయలకు తగ్గింది.


Tags:    

Similar News