Petrol Price Today: శుభవార్త.. మూడోరోజూ భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు!

Update: 2019-10-05 02:19 GMT

అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరిగినప్పటికీ.. దేశీయంగా పెట్రోల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా మూడో రోజూ దేశీయంగా పెట్రోల్ ధరలు దిగి వచ్చాయి. శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 31 పైసలు పెరిగి 78.73 రూపాయలకు దిగింది. ఇక డీజిల్ ధర 22 పైసలు తగ్గి 73.22 రూపాయలకు దిగి వచ్చింది.

అమరావతిలోనూ పెట్రోల్ ధర 30 పైసలు.. డీజిల్ ధర 21 పైసలు తగ్గాయి. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర 78.32 రూపాయలకు, డీజిల్ ధర 72.47 రూపాయాలకు తగ్గింది. అదేవిధంగా విజయవాడలో కూడా పెట్రోల్ ధర 30 పైసలు.. డీజిల్ ధర 21 పైసలు తగ్గి పెట్రోల్ 77.95 రూపాయలకు, డీజిల్ 72.13 రూపాయలకు దిగింది.

దేశవ్యాప్తంగానూ పెట్రోల్ ధరలు దిగివచ్చాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 28 పైసలు.. డీజిల్ ధర 22 పైసలు తగ్గాయి. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర 79.65 రూపాయలకు, డీజిల్ ధర 70.39 రూపాయలకు తగ్గింది. అదేవిధంగా దిల్లీలో కూడా పెట్రోల్ ధర 29 పైసలు.. డీజిల్ ధర 20 పైసలు తగ్గి పెట్రోల్ 74.04 రూపాయలకు, డీజిల్ 67.15 రూపాయలకు దిగింది.


Tags:    

Similar News