Petrol Price Today: శుభవార్త.. రెండో రోజూ పెట్రోలు ధర తగ్గింది.

గత కొంత కాలంగా ఎప్పుడూ పెరగడమే కానీ తగ్గడం ఎరుగని పెట్రోల్ ధరలు గురువారం లానే శుక్రవారమూ స్వల్పంగా తగ్గాయి. దీంతో ముంబాయిలో 80 రూపాయల్ని తాకిన పెట్రోల్ ధర ఆ నెంబర్ నుంచి కొద్దిగా కిందకి వచ్చింది.

Update: 2019-10-04 02:49 GMT

వరుసగా రెండో రోజూ పెట్రోల్ ధర తగ్గింది. ఈ మధ్యకాలంలో ఇలా వరుసగా రెండో రోజూ పెట్రోల్ ధర తగ్గడం ఇదే మొదటిసారి. గురువారం తో పోలిస్తే శుక్రవారం పెట్రోల్ ధర 10 పైసలు తగ్గింది.దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర 79.04 రూపాయలకు దిగింది. కనీ, డీజిల్ ధర లో మాత్రం మార్పు లేకుండా స్థిరంగా ఉంది. దీంతో శుక్రవారం డీజిల్ ధర 73.44 రూపాయలవద్ద నిలకడగా ఉంది. అదేవిధంగా అమరావతిలో పెట్రోల్ ధర 18 పైసలు తగ్గి 78.62 రూపాయలు గానూ, డీజిల్ ధర 8 పైసలు తగ్గడంతో 72.68 రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 18 పైసలు తగ్గింది. దీంతో 78.25రూపాయలకు చేరింది. ఇక డీజిల్ ధర కూడా 8 పైసలు తగ్గడంతో 72.34రూపాయలకు చేరుకుంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ పై 18 పైసలు, డీజిల్ పై 8 పైసలు ధర తగ్గడంతో ముంబయిలో పెట్రోల్ ధర 79.93 రూపాయలు, డీజిల్ 70.61 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ పై 18 పైసలు, డీజిల్ పై 8 పైసలు ధర తగ్గడంతో పెట్రోల్ ధర 74.33 రూపాయలుగానూ, డీజిల్ ధర 67.35రూపాయలుగానూ ఉంది.


Tags:    

Similar News