Petrol Price Today: స్థిరంగానే పెట్రోల్ ధర.. పెట్రో వాతలో రెండోస్థానంలో హైదరాబాద్!

పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా శనివారం స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశంలోని ఇతర నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ లో పెట్రోల్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ముంబయిలో అత్యధికంగా పెట్రోల్ ధర ఉంటె.. హైదరాబాద్ దాని తరువాతి స్థానంలో నిలిచింది.

Update: 2019-09-28 04:32 GMT

దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం స్థిరంగానే ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా ఇతర నగరాలలో ఉన్న పెట్రోల్ ధరలతో పోల్చుకుంటే హైదరాబాద్ లో పెట్రోల్ ధరలు రెండో స్థానంలో ఉన్నాయి. శుక్రవారం నాటి పెట్రోల్ ధరలే శనివారమూ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 79.02 రూపాయలు, డీజిల్ 73.29రూపాయల వద్ద నిలకడగా ఉన్నాయి. అదేవిధంగా అమరావతిలోనూ పెట్రోల్ ధర 78.69 రూపాయలు, డీజిల్ ధర 72.62 రూపాయలు గానూ మార్పు లేకుండా ఉన్నాయి. ఇక విజయవాడలో పెట్రోల్ ధర 78.32 రూపాయలు, డీజిల్ ధర కూడా 72.28 రూపయలుగానూ నిలిచాయి.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ముంబయిలో పెట్రోల్ ధర 80.00రూపాయలు గానూ, డీజిల్ ధర 70.55 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 74.34 రూపాయలుగానూ, డీజిల్ ధర 67.24 రూపాయలుగానూ ఉంది.


Tags:    

Similar News