Gold Rates Today: బంగారం ధర తగ్గింది!

శుక్రవారం బంగారం ధర తగ్గింది. పది గ్రాములకు 400 రూపాయల మేర దిగొచ్చింది. చాలాకాలంగా స్థిరంగా ఉన్న వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర 21 రూపాయల తగ్గుదల నమోదు చేసింది.

Update: 2019-09-27 02:55 GMT

గురువారం కొద్దిగా పెరిగిన బంగారం శుక్రవారం మాత్రం కొద్దిపాటి తగ్గుదలను నమోదు చేసింది. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధర పది గ్రాములకు 400 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు తగ్గడంతో 39,250 దగ్గర ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయలు తగ్గడంతో 35,3970 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర ఈ రోజూ స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర స్వల్పంగా 21 రూపాయలు తగ్గి 50,050 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం లలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు తగ్గడంతో 37,950 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 400 రూపాయలు తగ్గడంతో 36,750 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలూ స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కేజీ వెండి ధర స్వల్పంగా 21 రూపాయలు తగ్గి 50,050 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News