స్వల్పంగా పెరిగిన బంగారం! భారీగా తగ్గిన వెండి!!

ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరిగింది. వెండి ధర తగ్గింది.

Update: 2019-09-16 03:16 GMT

కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ఈరోజు స్వల్పంగా పెరిగింది. ఇదేసమయంలో వెండి ధర బాగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10రూపాయలు పెరిగి 39,100గా నిలిచింది. అదేసమయంలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 10రూపాయల పెరుగుదలతో 35,850రూపాయలకు చేరింది. ఇక మార్కెట్ లో వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. కేజీ వెండి ధర ఒకేసారి 2540 రూపాయలు తగ్గి, 48,760రూపాయలకు పడిపోయింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10రూపాయలు పెరిగి 37,810రూపాయల వద్ద ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయల పెరుగుదాలతో 36,610 రూపాయలకు పెరిగింది. కేజీ వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. 2,540 రూపాయల తగ్గుదలతో 48,760 రూపాయలకు చేరింది.

గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.98 శాతం పెరిగి 1,514.35 డాలర్లకు చేరుకుంది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 2.32 శాతం క్షీణించి 17.98 డాలర్లకు దిగొచ్చింది.



Tags:    

Similar News